దుబాయ్ లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన బాలిక యోగాలో ప్రపంచ రికార్డును సాధించింది. నిమిషాల వ్యవధిలో ఆ అమ్మాయి 100 యోగా భంగిమలను పూర్తీ చేసిందట..! ఆదివారం నాడు ఈ అరుదైన ఫీట్ ను ఆ బాలిక సాధించినట్లు ఖలీజ్ టైమ్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

11 సంవత్సరాల సమ్రిద్ధి కాలియా ఈ రికార్డును అందుకుంది. ఆమె సాధించిన మూడో ప్రపంచ రికార్డుగా చెబుతున్నారు. గత నెలలోనే ఆమె ఇంకో రికార్డును కూడా సాధించినట్లు చెబుతున్నారు.

'fastest hundred yoga postures performed in restricted space' అంటూ సమ్రిద్ధి సాధించిన రికార్డును 'గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డు' లో స్థానం కల్పించారు. ఎంతో కష్టపడి, ప్రతి రోజూ ప్రాక్టీస్ చేసినందుకే ఈ రికార్డును అందుకున్నానని సమ్రిద్ధి కాలియా తెలిపింది. మనం కష్టపడితే.. విజయాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాదని సమ్రిద్ధి చెప్పుకొచ్చింది. పలువురు ప్రముఖులు సమ్రిద్ధి అందుకున్న రికార్డుపై ప్రశంసలు కురిపించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story