భారత్‌లో ఇదే తొలిసారి: 24 గంటల్లో 7466 కరోనా కేసులు
By సుభాష్ Published on 29 May 2020 9:46 AM GMTచైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తోంది. ఇక భారత్‌లో చాపకింద నీరులా ప్రవేశించిన ఈ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7466 కరోనా కేసులు నమోదు కాగా, 175 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 చేరగా, 4706 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే గడిచిన 24 గంటల్లోనే ఇంత భారీగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇక కరోనా మరణాల్లో భారత్ చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటి వరకూ 46,34 కరోనా మరణాలు సంభవించగా, భారత్‌లో ఆ సంఖ్య 4706గా ఉండటం వైరస్ ఉధృతి ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమైపోతోంది. అంతేకాదు కరోనా కేసుల్లోనూ ప్రపంచంలోనే భారత్ 9వ స్థానంలో ఉంది. లక్షా 82వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా, లక్షా 60 వేల కేసులతో టర్కీ 10వ స్థానంలో ఉంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు 59 లోల మంది ఈ వైరస్ బారిన పడగా, వీరిలో మూడున్నర లక్షల మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల సంఖ్ చైనాను దాటేయగా, కేసుల్లో చైనా కంటే రెట్టింపు ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో ఇప్పటి వరకూ 82,995 కేసులు నమోదు కాగా, భారత్‌లో ఇప్పటి వరకూ 1,65,799గా ఉంది.