చైనా-పాక్ సంయుక్త ప్రకటనలో కశ్మీర్ అంశం.. ఘాటుగా బదులిచ్చిన భారత్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 5:35 AM GMT
చైనా-పాక్ సంయుక్త ప్రకటనలో కశ్మీర్ అంశం.. ఘాటుగా బదులిచ్చిన భారత్

ఓపక్క దాయాది దుర్మార్గం.. మరోపక్క దరిద్రపుగొట్టు డ్రాగన్. వీరిద్దరి టార్గెట్ ఎప్పుడూ భారత్ అనే విషయం తెలిసిందే.తాజాగా మరోసారి భారత్ ను ఇరుకున పెట్టేందుకు వీలుగా.. ఈ రెండు దేశాలు చేతలు కలిపాయి. భారత్ మీద తమకున్న అక్కసును వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. తమకు అలవాటైన విషాన్ని సంయుక్త ప్రకటనల రూపంలో చిమ్మాయి.

పాక్ మీదుగా చైనా నిర్మిస్తున్న చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించి ఇరు దేశాలు ఇటీవల సంయుక్త ప్రకటన చేయటం.. అందులో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ అంశాన్ని తీసుకురావటాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లుగా తేల్చేసింది. ఇలాంటి విషయాల్లో కశ్మీర్ ప్రస్తావన తేవటాన్ని తాము ఒప్పుకోమని ఘాటుగా తేల్చి చెప్పారు.

ప్రస్తుతం చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టులో కొంత భాగం పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా వెళుతోంది. దీనిపై భారత్ ఇప్పటికే తన అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. భారత్ తో పాటు.. పాక్ లోని బలూచిస్థాన్.. పంజాబ్ ప్రావిన్సులు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. అక్కడి ప్రజలు సైతం ఆగ్రహం ఉన్నారని చెబుతారు.

ఇదిలా ఉండగా.. తాజాగా పాక్.. చైనా విదేశాంగ మంత్రుల మధ్య వ్యూహాత్మక చర్చలు జరిగాయి. అనంతరం వారు ఉమ్మడిగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో..కశ్మీర్ అంశాన్ని నొక్కి పెట్టి.. దాన్ని పరిష్కరించాలన్నారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. మరే దేశం తమకు ఈ విషయం మీద మాట్లాడటానికి ఒప్పుకోమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఇతరుల జోక్యాన్ని తాము అంగీకరించమన్నారు.

Next Story