మే 7 నుంచి స్వదేశానికి భారతీయులు
By సుభాష్ Published on 5 May 2020 9:39 AM ISTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనాను కట్టిడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు నానా అవస్థలకు గురవుతున్నారు. దీంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా విమానాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉపాధి, ఉద్యోగ నిమిత్తం భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రరం. వారిని భారత్ కు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.
మే 7వ తేదీ నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ ఎంబసీలు, హై కమిషన్‌లు రెడీ చేస్తున్నట్లు తెలిపింది.
అయితే విమానాలు, నౌకలలో వచ్చే భారతీయులు రవాణా చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. మెడికల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా లేనివారికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. మే 7వ తేదీ నుంచి దశల వారిగా విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్‌కు రప్పించనున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది.