మనల్ని టెన్షన్ పెట్టే విషయమే..  కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ స్థానం ఏమిటంటే..?  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Aug 2020 10:10 AM GMT
మనల్ని టెన్షన్ పెట్టే విషయమే..  కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ స్థానం ఏమిటంటే..?  

ఒకానొక దశలో కరోనాను భారత్ బాగా కట్టడి చేసిందంటూ ప్రశంసలు దక్కాయి. టెస్టింగుల విషయంలో భారత్ మెరుగయ్యాక.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే రోజుకు 10వేలకు పైగా కేసులు వస్తున్నట్లు తెలిపాయి. రోజు రోజుకీ భారత్ లో కరోనా కేసులు అధికమవుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 53,601 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 871 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,68,676కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 15,83,490 మంది కోలుకుని నుంచి డిశ్చార్జి కగా.. 6,39, 929 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 45,257 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో రికవరీ రేటు 70శాతం ఉండగా.. మరణాల రేటు 1.99శాతంగా ఉంది.

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా ప్రభావం చూపుతున్న దేశంగా భారత్ నిలిచిందని నిపుణులు చెబుతూ ఉన్నారు. భారత్ లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వైద్యాధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇతర దేశాల్లో కోవిద్-19 కేసులు తగ్గుముఖం పడుతుండగా.. భారత్ లో మాత్రం పాజిటివ్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి.

భారత్ లో రికవరీ రేటు ఎక్కువగా ఉండడం కాస్త ఊరట కలిగించే అంశమే..! గత వారం రోజులుగా నమోదవుతున్న కేసులు, మరణాల విషయం యూఎస్, బ్రెజిల్ కంటే భారత్ లోనే అధికంగా వున్నాయి. మెక్సికోలో 53,003, బ్రిటన్ లో 46,611 మంది చనిపోగా, భారత్ లో 45,257 మంది మరణించారు. రాబోయే రోజుల్లో భారత్ లో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతూ ఉన్నాయి. కరోనాను కట్టడి చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానంలో నిలిచింది. పరిస్థితి చేజారిపోయేలా ఉంటే రాబోయే రోజుల్లో కఠిన చర్యలు అధికారులు తీసుకునే అవకాశం ఉంది.

Next Story
Share it