భారత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో భార‌త్‌లో 2,553 కేసులు న‌మోదు కాగా.. 72 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్య‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 42,533 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 1,373 మంది మర‌ణించారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 11,707 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 29,453 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 27.5 శాతం మంది కోలుకోగా.. మ‌ర‌ణాల శాతం 3.25 గా ఉంది.

దేశంలోని అత్య‌ధిక కేసులు మ‌హ‌రాష్ట్ర‌లో న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 12,974 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 548 మంది మ‌ర‌ణించారు. గుజ‌రాత్‌లో 5428కేసులు న‌మోదు కాగా.. 290మంది మృతి చెందారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 2846 కేసులు న‌మోదు కాగా.. 156 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో 4549 కేసులు న‌మోదు కాగా.. 64 మంది మృత్యువాత ప‌డ్డారు. ఏపీలో 1583 కేసుల సంఖ్య చేర‌గా.. 33 మంది మ‌ర‌ణించారు. తెలంగాణ‌లో 1082కి చేర‌గా.. 29మంది మృత్యువాత ప‌డ్డారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *