భారత్‌లో 24గంటల్లో 9,996 కేసులు.. 357 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 10:34 AM IST
భారత్‌లో 24గంటల్లో 9,996 కేసులు.. 357 మంది మృతి

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 9వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,996 కేసులు నమోదు కాగా.. 357 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,86,579 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8,102 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,37,448 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,41,029 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 5వ స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్‌, రష్యా, యూకే ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో 12వ స్థానంలో ఉంది.

Next Story