భార‌త్‌లో తీవ్ర‌రూపం దాలుస్తోన్న క‌రోనా.. రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2020 10:28 AM IST
భార‌త్‌లో తీవ్ర‌రూపం దాలుస్తోన్న క‌రోనా.. రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు

భారత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 7964 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 265 మృతి చెందార‌ని కేంద్ర‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌లో విజృంభ‌ణ మొద‌లైన త‌రువాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో క‌లిపి దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 1,73,763కి చేరింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 4,961 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 82,370 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 86,422 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో 62,228 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. త‌మిళ‌నాడులో 20,246 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ప్ర‌పంచంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదు అవుతున్న దేశాల్లో భార‌త్ 9వ స్థానానికి ఎగ‌బాకిన సంగ‌తి తెలిసిందే.

Next Story