భారత్‌ - చైనా కీలక నిర్ణయం

By సుభాష్  Published on  23 Jun 2020 9:23 AM GMT
భారత్‌ - చైనా కీలక నిర్ణయం

భారత్‌ - చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో తలెత్తిన ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సద్దుమణిగేలా భారత్‌ - చైనాలు చర్చలు జరుపుతున్నాయి. తాజాగా ఇరుదేశాల మధ్య కమాండర్‌ స్థాయిలో జరిపిన చర్చలలో సానుకూలమైన వాతావరణం నెలకొన్నట్లు ఆర్మీ వర్గాల ద్వారా సమాచారం. సోమవారం చైనా వైపున్న ఛుషుల్ సెక్టార్ లోని మోల్డోలో చర్చలు జరిగాయి. సుమారు పది గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఈ చర్చల్లో భారత్‌ - చైనా సైనిక దళాల మళ్లింపుపై పరస్పర అంగీకారం కుదిరినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం. అలాగే లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయిలో ఈ సంప్రదింపులు జరుగగా, ఇండో చైనా మధ్య నిన్న సుదీర్ఘంగా జరిగిన చర్చలు జరిగాయి.

ఇక భారత్‌ తరపున లెప్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌సింగ్‌, చైనా తరపున టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్ ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. వీరి స్థాయిలో ఇవి జరగడం ఇది మూడోసారి. అయితే గాల్వన్‌ వ్యాలీలోని అన్ని స్టాండ్‌ ఆఫ్‌ పాయంట్ల నుంచి ఇరు దేశాల దళాలు వెనక్కి వెళ్లాలని ఈనెల 6న జరిగిన చర్చల్లో నిర్ణయించారు. అయితే ఈనెల 15న గాల్వన్‌ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత్‌ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల అనంతరం మేజర్‌ జనరల్‌ స్థాయిలో మూడు సార్లు చర్చలు జరిగాయి. మే 2వ తేదీకు ముందు స్థితిని పునరుద్దరించాలని భారత సైన్యం కోరుతోంది. సోమవారం సాయంత్రం వరకూ జరిగిన చర్చలు.. మంగళ, బుధవారాల్లో కూడా కొనసాగనున్నాయి.

Next Story
Share it