జేబులకు చిల్లు..క్యాష్ నిల్
By రాణి Published on 24 March 2020 2:15 PM GMTముఖ్యాంశాలు
- కరోనాను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు
- ఆకాశాన్నంటుతున్న పూలధరలు
- అదేబాటలో పండ్లు కూడా..
- వినియోగదారుడి జేబుకు చిల్లు..
కరోనా వైరస్..దీని వల్ల యావత్ ప్రపంచం లక్షల కోట్లలో నష్టాలను చవి చూస్తున్నాయి. ఇప్పటి వరకూ కరోనావైరస్ బాధితుల సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉంది. 16,869 మంది ప్రాణాలు కోల్పోగా..ఒక్క ఇటలీలోనే మృతుల సంఖ్య 6 వేలకు పైగా ఉంది. 97,679 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కోలుకున్న వారంతా కరోనా ఫస్ట్ స్టేజ్ లోనే ఆస్పత్రుల్లో చేరి సమయానికి చికిత్స చేయించుకున్నారు. అందుకే వారంతా త్వరగా కోలుకున్నారని వైద్యులు చెబుతున్న మాట.
Also Read : తెలంగాణ కరోనా కేసులు @36
కాగా..కరోనా ఇండియాలో కూడా పంజా విసిరింది. దీనిని ఒక అహంకార పూరిత వైరస్ గా చెబుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్ మనకు మనంగా పిలిస్తే తప్ప మనజోలికి రాదట. అంటే మనం వైరస్ సోకిన వారితోమాట్లాడితే తప్ప వైరస్ మనను ఎటాక్ చేసే ఛాన్స్ లేదు. అందుకే దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి. షార్ ను కూడా షట్ డౌన్ చేశారు. నిత్యావసరాలు మినహా ఇతర ఏ సంస్థలూ పనిచేయవని ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇదే అదనుగా భావించిన కూరగాయలు, పాల వ్యాపారులు రేట్లు పెంచేశారు. లాక్ డౌన్ చేయక ముందు వరకూ కిలో మిర్చి 30-40 రూపాయలుంటే..ఇప్పుడు ఏకంగా రూ.60కి అమ్ముతున్నారు. ఒక్క మిర్చి ఏంటి..అన్ని కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. కూరగాయల కోసం మార్కెట్లకు వచ్చే వినియోగదారులను చూసిన వ్యాపారులు అప్పటికప్పుడు ఒకటికి రెండింతలు రేట్లు పెంచి అమ్మడం గమనార్హం. అందొచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. వినియోగదారులు తిరగబడటంతో కొంతమంది మామూలు ధరలకే అమ్మినా..మరికొంతమందైతే..మేం చెప్పిన రేటుకి కొనుక్కోండి. లేదా వెళ్లిపోండి అని దౌర్జన్యం చేశారు.
Also Read : ఏపీలో 10 పరీక్షలు వాయిదా
లాక్ డౌన్ చేసిన మొదటి రోజు కూరగాయలకు రెక్కలొస్తే..రెండవ రోజు అధికారుల హెచ్చరికలతో అవి కాస్త తగ్గాయి. కానీ..ఉగాది పండుగ ఎఫెక్టో..కరోనా ఎఫెక్టో తెలీదు గానీ పువ్వులు, పండ్లు, కొబ్బరికాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండుగన్నాక కాసినన్ని పువ్వులు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రి ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతి పండుగకు పువ్వులు, పండ్లు ధరలు పెరగడం మామూలే. కానీ ఈ ఉగాదికి మాత్రం వ్యాపారులు వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు.
Also Read : ఏం ఐడియా గురూ..! క్వారంటైన్‌లో ఉన్న పులిహోర బాగానే కలిపావుగా..
తాజా మల్లెపూలు మూర రూ.100 అమ్మితే..నిన్నటి పూలు మూర రూ.50 అమ్ముతున్నారు. ఇక చామంతులైతే సాధారణంగా పావు రూ.20 అమ్మేవారు. ఇప్పుడు ఏకంగా పావు రూ.100 అమ్ముతున్నారు. కిలో బంతిపూలు రూ.100, డజను అరటిపళ్లు రూ. 100, కిిలో ద్రాక్ష రూ.120, ఒక కొబ్బరి కాయ రూ.40-50 అమ్ముతున్నారు. అసలే ఇది తెలుగువారి మొదటి తెలుగు పండుగ, తెలుగు సంవత్సరాదిలో ముఖ్యంగా ఉండేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళన సోపానంలో మామిడి లేనిదే..పచ్చడి తయారవ్వదు. అలాంటి మామిడికాయను ఏకంగా రూ.50కి అమ్ముతున్నారు వ్యాపారులు. ఇదేమిటని అడిగితే..పొద్దున మార్కెట్లోకి వచ్చిన, పూలు, కూరగాయలన్నింటినీ వినియోగదారులే చెల్లా చెదురు చేసేశారమ్మ. మళ్లీ తోటలకి వెళ్లి కోసుకొచ్చి అమ్ముకుంటున్నాం. అని చెప్తున్నారు. ఏదేమైనా కరోనా ఎందరికో చేటు చేస్తే..కొందరికి మాత్రం మేలు చేస్తోంది.