తెలంగాణ కరోనా కేసులు @36

By రాణి  Published on  24 March 2020 8:18 AM GMT
తెలంగాణ కరోనా కేసులు @36

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 500 కేసులు నమోదవ్వగా..ఒక్క మహారాష్ట్రలోనే 100 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర తర్వాత కేరళలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. డబ్ల్యూహెచ్ ఓ తెలిపిన లెక్కల ప్రకారం కేరళలో 96 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీలో ఒక కరోనా అనుమానితుడు ఆస్పత్రిలో చేరగా..అతడి నుంచి వైద్యులు రక్తనమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు.

Also Read : పెరుగుతున్న కరోనా కేసులు..భారత్ లో 10కి చేరిన మృతుల సంఖ్య

ఇటు తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 36కు చేరింది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా..ఆ ముగ్గురికీ కరోనా నిర్థారణయింది. లండన్ నుంచి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు, సౌదీ నుంచి వచ్చిన 61 ఏళ్ల మహిళకు కరోనా నిర్థారణైనట్లు వైద్యులు వెల్లడించారు. వీరి ముగ్గురినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అంజేస్తున్నారు.

Also Read : హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో కరోనా నయమవుతుందా ?

మరోవైపు కోఠిలో కూడా ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లుగా గుర్తించారు. అతడిని వెంటనే గాంధీకి తరలించారు. ఆ వ్యక్తికి సంబంధించిన కరోనా టెస్ట్ రిపోర్ట్ ఇంకా రాలేదు. కాగా..ఇతను గత కొద్దిరోజులుగా ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్ట్ ల వద్ద ఉన్నాడు.

Next Story