ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిసెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 12:07 PM GMT
ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిసెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్

తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు 'మిస్టర్ అండ్ మిసెస్' అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ విడుదల చేశారు. పోస్టర్ ఇన్నోవేటివ్‌గా ఉందని మెచ్చుకుంటూ ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు మధుర శ్రీధర్.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడతూ... ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతికి పెళ్లవుతుంది. వీరిలో ఒకరి మొబైల్ మిస్ అవుతుంది.. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..? యూత్ రిలేట్ అయ్యే కంటెంట్‌తో ఈ సినిమా కథనం సాగుతుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో ఉన్న ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు.

Next Story
Share it