Fact Check : నోట్ల మీద రాయకూడదా.. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది 2600 కోట్ల రూపాయలను నష్టపోతోందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Sep 2020 9:30 AM GMTనోట్ల మీద పెన్నుతో రాసి ఉండడాన్ని చాలాసార్లు మనం గమనించే ఉంటాం. అలా నోట్ల మీద పెన్నుతో రాయడం వలన భారత ప్రభుత్వం 2600 కోట్ల రూపాయలు నష్టపోతోందని.. దయచేసి పెన్నుతో ఎవరూ రాయకండి అంటూ ఓ మెసేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
'ప్రజలందరూ ఈ విషయాన్ని ఎప్పుడు గౌరవిస్తారో.. దేశానికి నష్టం కలగనివ్వకుండా చూడండి. ప్రతి ఒక్కరికీ తెలియజేయండి' అంటూ ఫోటోలు, పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ అవుతున్న ఫోటోలో ఓ వైపు కొత్త 2000 రూపాయల నోటు ఉండగా.. మరో వైపు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా లోగో ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
నోట్లపై రాస్తున్న కారణంగా భారత ప్రభుత్వం నష్టపోతోంది అన్న విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ చెప్పలేదు. ఇదే తరహా వైరల్ మెసేజీ 2015 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ మెసేజీలో ఎటువంటి నిజం లేదని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది.
India Today కూడా ఈ వైరల్ అవుతున్న మెసేజీ పెచ్చు అబద్ధం అని తెలిపింది. నోట్ల మీద రాస్తే అధికారులు చర్యలు తీసుకునేలా ఎటువంటి చట్టం కూడా భారత్ లో లేదని తెలిపారు.
Livemint లో ఏప్రిల్ 2015 లో రైట్ లు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ద్వారా ఆర్.బి.ఐ. ఒక్కో నోటు ప్రింట్ చేయడానికి అయ్యే ఖర్చును మాత్రమే వెల్లడించింది. నోటు ముద్రణ పెరిగే కొద్దీ.. ఆ నోటులో ఖచ్చితమైన సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటూ ఉండడంతో ముద్రణకు కాస్త ఖర్చు ఎక్కువవుతూ ఉంటుందని తెలిపింది. 10 రూపాయల నోటు ముద్రణకు అయ్యే ఖర్చు 10 రూపాయలలో 10 శాతం ఉండగా, 100 రూపాయల ముద్రణకు ఆ నోటులో రెండు శాతం కంటే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపింది.
itsmydesh.in 2016 లో ముద్రణకు అయ్యే ఖర్చులను.. ప్రింట్ అయ్యే నోట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2012-13 నుండి 2013-14 సమయంలో డబ్బుల సప్లై ను 12.835 ట్రిలియన్ల నుండి 14.265 ట్రిలియన్లకు పెంచింది. కింద ఉన్న గణాంకాలు కరెన్సీ సర్క్యులేషన్ గురించిన వివరాలు తెలియజేస్తాయి.
ప్రింట్ అయిన నోట్లు (2,5,10,20,50,100,500,1000) = (0.47, 0.83, 2.97, 0.48, 0.38, 1.65, 1.27, 0.57).
నోట్లను ప్రింట్ చేయడానికి అయిన ఖర్చు = sumproduct (0.47, 0.83, 2.97, 0.48, 0.38, 1.65, 1.27, 0.57) * (0.48, 0.96, 1.5, 1.81, 1.79, 2.5, 3.17)
= INR 12.8 బిలియన్లు
= INR 12,800 కోట్లు
ప్రతి ఒక్క నోటును కూడా రిజర్వ్ బ్యాంకు రీప్లేస్ చేయదు. కొన్ని నోట్లను ఎక్కువగా ముద్రిస్తూ ఉంటె.. మరికొన్ని నోట్లను తక్కువ ముద్రిస్తూ ఉంటుంది. జీడీపీ, ఇన్ఫ్లేషన్ లాంటి వాటిపై కూడా నోట్ల ముద్రణ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నోట్ల ముద్రణలో 20 శాతం గతంలో ముద్రించిన నోట్లను తిరిగి మార్చాలి అంటే దాదాపు 2600 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. itsmydesh.in కేవలం ఉదాహరణగా ఈ గణాంకాలను చెప్పారు.
కాబట్టి తిరిగి ముద్రిస్తూ పోవడం వలన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం నోట్ల మీద రాసి ఉన్న వాటిని తిరిగి ముద్రించడం లేదు. వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి 'నిజం లేదు'.