పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను రూపొందించిన ఐఐటీ హైదరాబాద్‌

By సుభాష్  Published on  4 April 2020 4:09 AM GMT
పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను రూపొందించిన ఐఐటీ హైదరాబాద్‌

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్కులు, వెంటిలేటర్ల తయారీకి సంబంధించిన నమూనాలపై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో ఇటీవల తయారయ్యే బ్యాగ్‌ వాల్స్‌ మాస్క్‌ను,

కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్క్‌లు, వెంటిలేటర్ల తయారీకి సంబంధించిన నమూనాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్‌ ఐఐటీ తక్కువ ఖర్చుతో తయారయ్యే ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’ను డిజైన్‌ చేసింది. అంతేకాదు అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్‌ను కూడా తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ)కి చెందిన ఏరోబయోసిస్‌ ఎన్నోవేషన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ఈ వెంటిలేటర్‌ను రూపొందించింది. అంతేకాదు ఇందులో అత్యాధునిక ఫీచర్లు కూడా ఉంటాయని ఏరోబయోసిస్‌ చెబుతోంది. 'జీవన్‌లైట్‌'గా పిలిచే ఈ వెంటిలేటర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఆధారంగా పని చేయనుంది. దీంతో విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడుకునే విధంగా రూపొందించింది.

ప్రస్తుతం కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ఈ జీవన్‌లైట్‌ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ వైద్యులు, రోగుల కుటుంబ సభ్యులకు రక్షణగా నిలువనుంది. ఇది లక్ష రూపాయలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ మూర్తి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 50 నుంచి 70 యూనిట్లు మాత్రమే తయారు చేసే సామర్థ్యం ఏరోబయోసిస్‌కు ఉందని తెలిపారు.

ప్రభుత్వం ముందుకు రావాలి

వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ రేణు జాన్‌ కోరుతున్నారు.

రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు

కాగా, రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు చేసి వైద్యుడికి యాప్‌ ద్వారా సమాచారం అందించే ఫీచర్‌ కూడా ఉంది. ఈ ఫీచర్‌తో పాటు ఆక్సిజన్‌ సిలిండర్‌ను కూడా జాత చేసి ఈ వెంటిలేటర్‌ను రూపొందించామని తెలిపారు. ఇక కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, డైరరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌, డీఆర్‌డీవో, ఐసీఎంఆర్‌ తదితర సంస్థల ప్రామాణికాలకు అనుగుణంగానే దీనిని తయారు చేసినట్లు ఏరో బయోసిస్‌ వెల్లడించింది.

ఎవరెవరికి వాడొచ్చు..

టైప్‌-2 డయాబెటిస్‌ ఉన్నవారు, కరోనా బారిన పడినవారు, అలాగే శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి అత్యవసర సమయాల్లో ఈ వెంటిలేటర్‌ను ఎంతో ఉపయోగపడుతుంది. కరోనా బారిన పడినవారికే కాకుండా చిన్న పిల్లలు, వృద్ధులకు దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీని ఒకసారి చార్జ్‌ చేస్తే ఐదు గంటల వరకు పని చేస్తుందని దీనిని డిజైన్‌ చేసిన ఏరోబయోసిస్‌ ఇన్నోవేషన్‌ వివరిస్తోంది.

Next Story
Share it