ఇడుపులపాయ టూరిజంపై జ‌గ‌న్ స‌మీక్ష‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 10:28 AM GMT
ఇడుపులపాయ టూరిజంపై జ‌గ‌న్ స‌మీక్ష‌

ఇడుపుల‌పాయ టూరిజంపై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. టూరిజం ప్రాజెక్టులపై అధికారులు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాగా, వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్, బొటానికల్‌ గార్డెన్, గండి టెంపుల్‌ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్‌ సఫారీ, పీకాక్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ల పూర్తి వివ‌రాలను జ‌గ‌న్ దృష్టికి తీసుకువ‌చ్చారు అధికారులు. బ్యూటిఫికేషన్‌ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్స్‌ ఉండాలి జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. ఏ పని చేసినా ధీర్ఘకాలికంగా మన్నికతో పాటు ప్రాజెక్టును ఆకర్షణీయంగా ఉండేలా దూపొందించాల‌న్నారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు వన్నె తగ్గకుండా చూసుకోవడంతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు కావాల్సిన పనులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అలాగే క‌డప, పులివెందులను మోడల్‌టౌన్స్‌గా తీర్చిదిద్దాల‌ని, పైలెట్‌ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలన్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకోవాల‌న్నారు.

పులిచింతలలో వైయస్ఆర్ ఉద్యానవనం ప్రణాళికను... విశాఖ‌లో లుంబినీ పార్క్‌ అభివృద్ది వివ‌రాల‌ను సీఎం జ‌గ‌న్‌కు వివ‌రించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ఇదే తరహాలో పార్క్‌ రూపొందించాలని అధికారులకు జ‌గ‌న్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఏపీ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ అధికారులు హాజ‌ర‌య్యారు.

Next Story