కాపీ కొట్టకుండా డబ్బా ఐడియా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 8:03 AM GMT
కాపీ కొట్టకుండా డబ్బా ఐడియా

విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకూడదు అంటే ఏం చేయాలి. ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్‌గా ఉండాలి. లేదా విద్యార్థులే కాపీ కొట్టడం వల్ల జరిగే నష్టాలను తెలుసుకొని తమకు తాముగా చూసి రాయడం మానేసేలా వారిని ఎడ్యుకేట్ చేయాలి. కర్ణాటక రాష్ట్రం హవేరిలోని ఒక కాలేజ్ యాజమాన్యం కొత్తగా ఆలోచించింది . విద్యార్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకు వాళ్ళ తలచుట్టూ బాక్సులు పెట్టింది. పిల్లల తలకు సరిపడా కార్డుబోర్డు బాక్స్‌లు సంపాదించి వాటికి ఒక వైపు ట్రాన్స్పరెంట్ పేపర్ పెట్టి ఆ బాక్స్ లని పిల్లల తలలకి తగిలించింది. ఈ బాక్స్‌ని పెట్టుకొని పరీక్ష రాసేందుకు విద్యార్థులు కాస్త ఇబ్బందులు పడ్డారు.

Karnataka Cooleg

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సైతం మండిపడుతున్నారు. దీంతో కన్నడ ఎడ్యుకేషన్ బోర్డు ఈ సంఘటనపై వివరణ కోరింది. ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటం సరికాదని తెలిపింది. కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ సంఘటనను సమర్థించుకుంది. గతంలో బీహార్‌లోని ఓ కళాశాల ఇలా చేస్తే అందరూ అద్భుతం అన్నారంటూ గుర్తు చేసింది. అయినా ఈ విషయంపై ముందుగానే విద్యార్థులకు సమాచారాన్ని ఇచ్చామని వాళ్ళు అందరూ అంగీకరించిన తర్వాతే ఈ విధంగా పరీక్ష రాయించామని కళాశాల యాజమాన్యం చెప్పింది.

Next Story