ఐఏఎస్‌లకు మొట్టికాయలు వేసిన హైకోర్ట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 1:21 PM IST
ఐఏఎస్‌లకు మొట్టికాయలు వేసిన హైకోర్ట్..!

హైదరాబాద్‌: తెలంగాణ ఐఎఎస్‌ అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఐఎఎస్‌లు ఈ దేశ పౌరులు కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. కోట్లు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఎఎస్‌లను చేస్తే మీరు సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారని హైకోర్టు ఐఎఎస్‌ అధికారులను సూటిగా ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే ఐఎఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎవరైనా మరణిస్తే దానికి ఐఎఎస్‌లే బాధ్యత వహించాలని హైకోర్టు సూచించింది. మరణించిన కుటుంబానికి రూ.5 లక్షలను ఐఎఎస్‌ల సొంత అకౌంట్‌ నుంచి చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఐఎఎస్‌ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తొందని హైకోర్టు పేర్కొంది.

Next Story