హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో కరోనా నయమవుతుందా ?

By రాణి  Published on  24 March 2020 11:50 AM IST
హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో కరోనా నయమవుతుందా ?

యావత్ ప్రపంచంలో 200 దేశాలు కరోనా బారిన పడ్డాయి. అన్నింటికన్నా ఎక్కవగా ఇటలీ దేశస్థులు కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నారు. రోజులు గడిచేకొద్దీ వైరస్ తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. వైరస్ ను నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం ఒక కారణమైతే, కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వాలు సూచించిన జాగ్రత్తలు తీసుకోలేదు అక్కడి ప్రజలు. మరోవైపు 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉండటంతో కరోనా వైరస్ తన సామ్రాజ్యాన్ని ఇటలీలో అంతకంతకూ విస్తరించుకుంటూ పోతుంది. ఇంతవరకూ అక్కడ కరోనా బారీ నుంచి కోలుకున్న వారికంటే చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ.

Also Read : క‌రోనాపై పోరుకు విరాళం ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ అధినేత‌

కాగా..తాజాగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును కరోనా వైరస్ సోకిన వారికి ఇవ్వడం వల్ల కాస్త మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని ఐసీఎంఆర్ (Indian Council of Medical Research) వెల్లడించింది. ఐసీఎంఆర్ చేసిన పరిశోధనలో ఈ విషయం నిర్థారణయింది. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న వారికి ఈ మెడిసిన్ ఇచ్చేందుకు డీజీసీఐ (Directorate General of Commercial Intelligence and Statistics) కూడా ఆమోద్ర ముద్ర వేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. అయితే 15 ఏళ్ల లోపు వారికి ఈ మందును ఇవ్వకూడదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు.

ఎవరెవరికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వొచ్చు ?

  • కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చు.
  • కరోనా వైరస్ సోకిన బాధిత కుటుంబ సభ్యులకు కరోనా లేకపోయినా కూడా ఈ మందును ఇవ్వొచ్చు.
  • ఈ మందు వేసుకున్నాం కదా ..వైరస్ నుంచి బయటపడ్డాం అని మాత్రం అనుకోవద్దు. ఎప్పటిలాగానే చేతులు శుభ్రం చేసుకుంటూ, శానిటైజర్లను వాడాల్సిందే.
  • శ్వాససంబంధిత వ్యాధులున్నవారు మరింత జాగ్రత్త పడాల్సిన తరుణమిది.
  • కరోనా బాధితులతో హై రిస్క్‌ కాంటాక్ట్స్‌ ఉన్నవారు రోగ నిరోధక చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఇంటికెళ్లాక నిర్బంధంలో ఉండాలి.
  • హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను రిజిష్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషినర్‌ సూచనల మేరకే తీసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే ఈ ఔషధాన్ని వాడకూడదు.
  • జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..ఇలాంటి లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఈ మందును వినియోగిస్తున్నప్పుడు ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

Also Read : ఇటలీ అధ్యక్షుడు కన్నీరు పెట్టలేదు.. అది ఫేక్

ఎంత మోతాదులో వాడితే మంచిది ?

  • హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వైద్య సిబ్బంది మొదటి రోజు రెండు సార్లు 400 ఎంజి, తర్వాత వారానికోసారి ఏడువారాల పాటు 400 ఎంజి మోతాదులో భోజనంతో కలిపి వేసుకోవాలి.
  • రోగులతో కలిసి ఉన్నవారు తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. తీసుకోవాలి. తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎం.జి. ఔషధాన్ని భోజనంతోపాటు తీసుకోవాలి.

Also Read : భారత్ లో 20 కోట్ల మంది కరోనాతో చనిపోతారా.?

ఈ మందు వాడేవారు పాటించాల్సిన జాగ్రత్తలు

  • హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును 15 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వకూడదు,
  • ఔషధ వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే హెల్ప్‌లైన్‌ ద్వారా గానీ, యాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలి.
  • కరోనా వైరస్ ప్రభావం వల్ల వైరస్ లేనివారు ఈ మెడిసిన్ ను వాడినప్పటికీ ప్రభుత్వాలు సూచించినట్లు వీలైనంతవరకూ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండటమే మంచిది.

Next Story