ఉద్యోగం కోల్పోతానేమోనన్న భయం.. ఉద్యోగిని సూసైడ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 1:02 PM IST
హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఉద్యోగం కోల్పోతానేమోనని మనస్థాపానికి గురై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌లోని క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్‌వేర్ సంస్థలో గత రెండున్నర సంవత్సరాలుగా హరిణి పని చేస్తోంది. గచ్చిబౌలిలోని తాను ఉంటున్న హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు హరిణి ఉరివేసుకుంది. తాను పని చేస్తున్న సంస్థ ఒప్పందం ప్రకారం డిసెంబర్ నెలతో ఉద్యోగం ముగియనున్నడంతో తాను ఉపాధి కోల్పోతాననే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story