కనిపించని జగన్ ఫొటోలు.. ఆస‌క్తిక‌ర నినాదాలు

YS Sharmila meeting flexis at lotus pond.లోట‌స్‌పాండ్‌లోని ఆమె ఇంటి ద‌గ్గ‌ర భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే.. ఆ ఫ్లెక్సీల్లో ఎక్క‌డా కూడా వైఎస్ జ‌గ‌న్ ఫోటో క‌నిపించ‌లేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2021 11:31 AM IST
YS Sharmila meeting flexis at lotus pond

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుమారై వైఎస్ ష‌ర్మిల.. హైదరాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లోని త‌న నివాసంలో మ‌రికాసేప‌ట్లో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ వైఎస్సార్ అభిమానుల కోలాహ‌లం మొద‌లైంది. 150 మంది ముఖ్య కార్య‌క‌ర్త‌ల‌తో ష‌ర్మిల స‌మావేశం కానున్న నేప‌థ్యంలో ఆమె ఇంటి ద‌గ్గ‌రికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. లోట‌స్‌పాండ్‌లోని ఆమె ఇంటి ద‌గ్గ‌ర భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే.. ఆ ఫ్లెక్సీల్లో ఎక్క‌డా కూడా వైఎస్ జ‌గ‌న్ ఫోటో క‌నిపించ‌లేదు. రాజ‌శేఖ‌ర్ రెడ్డితో పాటు ష‌ర్మిల ఫోటోలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి.

'మన కష్టం తెలుసని, మన కన్నీళ్లు తెలుసని, మన బ‌తుకులు మార్చే బాట' అని అందులో అని ఫ్లెక్సీలో ఉంది. 'జ‌నంలోకి వ‌స్తుంది ష‌ర్మిల‌క్క‌.. జ‌న‌రంజ‌క‌పాల‌న ముందుందిక' అని ప‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు కావ‌డం ఆసక్తిక‌రంగా మారింది. గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలను స‌మావేశానికి రావాల‌ని షర్మిల ఇప్ప‌టికే ఆహ్వానించారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ సమావేశంలో కొత్త పార్టీపై కార్యకర్తలతో షర్మిల చ‌ర్చించ‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదంటే ష‌ర్మిల నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లోనూ వైసీపీ ముందుకు వెళ్తుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ఈ రోజు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.




Next Story