ఇటీవల కేబుల్ బ్రిడ్జ్‌పై బైక్‌తో స్టంట్స్ చేసిన యువకుడిని పోలీసులు పట్టుకుని, కౌన్సెలింగ్ ఇచ్చారు. నేను స్టంట్స్ చేయడంతో పోలీసులు బైక్‌కు చలానా వేశారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై అలా చేయను. మీరు కూడా ఇలాంటివి చేయకండని అతడు చెప్పిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేశారు. స్టంట్స్ చేస్తే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అవుతాయని.. ఇలాంటి చర్యలకు పాల్పడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల పోకిరీలు బైక్ పై వెళ్తూ స్టంట్ లు వింత వింత విన్యాసాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులకు సైతం వారిని పట్టుకోవడం సవాల్‌గా మారుతుంది. కొన్ని సందర్భాల్లో స్టంట్స్‌కు సంబంధించిన దృశ్యాలు.. సీసీటీవీ లలో రికార్డు కావడం.. మరికొన్ని సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించడంతో.. వెంటనే స్పందించి పోలీసులు అట్టి వారిని అరెస్టు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కేబుల్ బ్రిడ్జిపై, గచ్చిబౌలి వైపు కొంతమంది యువకులు బైక్‌లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు. రద్దీగా ఉన్న రోడ్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నారు. పోలీసుల చర్యలతో ఇకనైనా ఈ పోకిరీల ఆగడాలకు చెక్ పడుతుందని అందరూ భావిస్తున్నారు.