హుస్సేన్ సాగర్ లోకి దూకేసిన వ్యక్తి

Youngster jumps into Hussain Sagar. హుస్సేన్ సాగర్‌లోకి దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించిన ఓ యువకుడిని లేక్ పోలీసులు రక్షించారు

By Medi Samrat
Published on : 18 May 2022 5:00 PM IST

హుస్సేన్ సాగర్ లోకి దూకేసిన వ్యక్తి

హుస్సేన్ సాగర్‌లోకి దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించిన ఓ యువకుడిని లేక్ పోలీసులు రక్షించారు. బోయినపల్లికి చెందిన షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి హుస్సేన్ సాగర్ వద్దకు వచ్చి అకస్మాత్తుగా రెయిలింగ్ దాటి సరస్సులోకి దూకాడు. ఇది గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లేక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు స్థానికుల సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని రక్షించారు. తాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నానని, అందుకే డిప్రెషన్‌లోకి జారుకున్నానని షేక్ పోలీసులకు తెలిపాడు. పోలీసులు అతని కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు.







Next Story