జూపార్క్‌లో యువకుడు హల్‌చల్..
Young Man Halchal In Zoo Park. జూపార్క్‌లో ఈ రోజు మధ్యాహ్నం కలకలం రేగింది. మధ్యాహ్నం 03:30 గంటల ప్రాంతంలో
By Medi Samrat Published on
23 Nov 2021 1:37 PM GMT

జూపార్క్‌లో ఈ రోజు మధ్యాహ్నం కలకలం రేగింది. మధ్యాహ్నం 03:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఆఫ్రికన్ సింహం ఉన్న ఎగ్జిబిటెడ్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. గమనించిన జూ సిబ్బంది వెంటనే యువకుడిని అడ్డుకున్నారు. అతడిని ఎర్రగడ్డకు చెందిన సాయి కుమార్ గా జూ సిబ్బంది గుర్తించారు. హోటల్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న సాయికుమార్ మానసిక పరిస్థితి సరిగాలేదని సిబ్బంది పేర్కొన్నారు. యువకుడిని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. జూ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story