న‌డిరోడ్డుపై యువ‌కుడు వీరంగం

యూసఫ్ గుడాలో ఓ యువకుడు న‌డిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి యూసఫ్ గుడా లో ఓ యువకుడు

By Medi Samrat  Published on  19 Feb 2024 6:15 PM IST
న‌డిరోడ్డుపై యువ‌కుడు వీరంగం

యూసఫ్ గుడాలో ఓ యువకుడు న‌డిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి యూసఫ్ గుడా లో ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుల‌లో త‌నిఖీల‌లో ప‌ట్టుబ‌డ్డాడు. పోలీసులు ఆప‌డంపై ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నాతో పెట్టుకుంటే అంతు చూస్తా నేను సైకో.. నాకు చలాన్ రాస్తే నీ ఉద్యోగం ఊడదీస్తా.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నా గురించి తెలుసుకో.. నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు... నీ గురించి ఆలోచించుకో అంటూ పోలీసు అధికారిపై బెదిరింపులకు దిగాడు.

ఛ‌లానా వేస్తే నా బైక్ మీద పెట్రోల్ పోసి కాల్చేస్తా అంటూ ఎస్ఐ నరేష్‌తో దురుసుగా మాట్లాడుతూ వీరంగం సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆంజనేయులు అనే యువకుడిపై కేసు నమోదు చేశారు.

Next Story