విమానయాన ప్రియులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విమానం హైదరాబాద్ కు వచ్చింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేకమైన విమానం ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంలో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా నవంబర్ 4న హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. తిమింగలం ఆకారంలో ఉన్న బెలూగా విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. డిసెంబర్ 5వ తేదీ రాత్రి 7.20 గంటల వరకు ఉండనుంది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఆదివారం రాత్రి ఆర్జీఐ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే అతిపద్ద విమానాల్లో ఒకటైన దీనిని సరుకు రవాణా కోసం ఉపయోగిస్తారు. 56 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విమానం ఫోటోలను తీసిన పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎయిర్‌బస్ బెలూగా భారీగా సరుకులను రవాణా చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ Antonov An-225 మే 2016లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. భారతదేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లో ల్యాండింగ్ చేయడం విశేషం.