హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లు, బార్‌లు, బేకరీలపై అధికారులు ఓ వైపు వరుస దాడులు చేస్తూ ఉండగా.. ఒక మహిళ తాను తెచ్చుకున్న పేస్ట్రీలో ఫంగస్ కనిపించిందంటూ బాధను వ్యక్తం చేసింది. ఇటీవల సైనిక్‌పురిలోని ప్రముఖ బేకరీ అయిన 'ఫిఫ్త్ అవెన్యూ బేకర్స్'ని సందర్శించిన ప్రీతి బిస్వాస్.. ఎక్లెయిర్ పేస్ట్రీని ఆర్డర్ చేయగా.. అందులో ఫంగస్‌ని కనుగొంది.
ఎక్స్‌లో తన అనుభవాన్ని పోస్ట్ చేస్తూ, “హైదరాబాద్‌లో ఇకపై ఫుడ్ జాయింట్‌ను విశ్వసించలేము” అని రాసుకొచ్చింది. తన పేస్ట్రీ వ్యవహారం గురించి ఫిర్యాదు చేయడమే కాకుండా.. సంబంధిత అధికారిని కూడా ట్యాగ్ చేసింది. ఈ బేకరీ 30 సంవత్సరాలుగా తన వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ఘటనపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫుడ్ జాయింట్‌లపై ఫుడ్ డిపార్ట్మెంట్ దాడులు నిర్వహిస్తోంది. ఎన్నో ఫేమస్ హోటల్స్ కనీస ప్రమాణాలను పాటించడంలో ఘోరంగా విఫలమయ్యాయి.