మోమోస్ తిని మ‌హిళ మృతి.. 50 మందికి అస్వ‌స్థ‌త‌

మోమోస్ తిని మృత్యువాత ప‌డ్డ ఘ‌ట‌న‌ హైదరాబాద్ నగరం నడి బొడ్డున జరిగింది.

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 4:41 PM IST
మోమోస్ తిని మ‌హిళ మృతి.. 50 మందికి అస్వ‌స్థ‌త‌

మోమోస్ తిని మృత్యువాత ప‌డ్డ ఘ‌ట‌న‌ హైదరాబాద్ నగరం నడి బొడ్డున జరిగింది. నంది నగర్‌లో 20 మందికి పైగా మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారు. బంజారా హిల్స్ పరిధిలో వారాంతపు సంతలో కొంతమంది నిర్వాహకులు మోమోస్ అమ్మకాలు జరిపారు. అయితే ఆ సంతకు వచ్చిన కొంత‌మంది అక్క‌డ‌ మోమోస్ తిన్నారు. వారితో సింగాడికుంటలో నివసిస్తున్న ఓ వివాహిత అక్క‌డ‌ మెమోస్ తిని మృతి చెందింది. బంజారా హిల్స్ లోని నంది నగర్ లో నివాసం ఉంటున్న దాదాపు 50 మందికి పైగా మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ అయి వాంతులు, విరోచనాలు అయ్యాయి. వీరందరూ పలు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.అయితే అందులో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాసిర‌కం మోమోస్ అమ్మిన నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ విష‌య‌మై కేసు నమోదు చేసుకొని విచారణ చేప‌ట్టారు.


Next Story