Hyderabad: ఎంపీ అభ్యర్థిని హగ్‌ చేసుకున్న మహిళా పోలీస్‌.. సస్పెండ్‌

ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్‌ ఏఎస్‌ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు.

By అంజి
Published on : 22 April 2024 3:25 PM IST

Woman ASI suspend, BJP, Hyderabad, MP candidate Madhavilatha

Hyderabad: ఎంపీ అభ్యర్థిని హగ్‌ చేసుకున్న మహిళా పోలీస్‌.. సస్పెండ్‌

ఎన్నికల సమయంలో అధికారులు ఆచితూచి వ్యవహరించకపోతే వేటు తప్పదు. సాధారణ సమయంలో రాజకీయ నేతలతో వారి సత్సంబంధాలు ఎలా ఉన్నా.. కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు హద్దులు మీరకూడదు. తాజాగా ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్‌ ఏఎస్‌ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆమె కోడ్‌ ఉల్లంఘించారంటూ సీపీ శ్రీనివాస్‌ రెడ్డి ఉమాదేవిని సస్పెండ్ చేశారు.

సైదాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవి లతను కరచాలనం చేసి కౌగిలించుకున్న సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. మాధవి లత, బీజేపీ కార్యకర్తల ప్రచారంలో ఏఎస్ఐ బందోబస్త్ డ్యూటీలో ఉన్నారు. ఓ వీడియోలో.. మహిళా ఏఎస్‌ఐ బీజేపీ అభ్యర్థికి దగ్గరగా వెళ్లి కరచాలనం చేసిన తర్వాత ఆమెను కౌగిలించుకోవడం కనిపిస్తుంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేయబడింది. సీనియర్ పోలీసు అధికారుల దృష్టిని ఆకర్షించింది, వారు విచారణకు ఆదేశించారు. ఏఎస్‌ఐని సస్పెండ్ చేశారు.

Next Story