మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. 6వ తేదీ మద్యం దొరకదు

Wine shops closed on the occasion of Hanuman Jayanthi. మందుబాబులకు అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 6వ తేదీన హ‌నుమాన్ జయంతి

By Medi Samrat  Published on  4 April 2023 6:02 PM IST
మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. 6వ తేదీ మద్యం దొరకదు

Wine shops closed on the occasion of Hanuman Jayanthi


మందుబాబులకు అధికారులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 6వ తేదీన హ‌నుమాన్ జయంతి సంద‌ర్భంగా రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయనున్నారు. ఈ మేరకు సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. 6వ తేదీన ఉద‌యం 6 గంట‌ల నుంచి 7వ తేదీన ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, క‌ల్లు ద‌కాణాలు మూసి ఉంటాయ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ డీఎస్ చౌహాన్ హెచ్చ‌రించారు.

ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ జయంతి ర్యాలీకి అందరూ సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. హనుమాన్ జయంతి ర్యాలీ ఏర్పాట్లపై జిహెచ్‌ఎంసి, ఈఎంఆర్‌ఐ, ఆర్ అండ్ బి, ఫైర్, ఆర్‌టిసి, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. హనుమాన్ జయంతి రోజున సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి వచ్చే ఊరేగింపులు కూడా నిబంధనలు పాటించాలని అన్నారు. ఊరేగింపు సజావుగా సాగేందుకు బారికేడింగ్, లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


Next Story