కొంద‌రి వ‌ల్ల‌ సంస్థ మొత్తాన్ని నిషేదించ‌డంలో అర్థం లేదు

Why right-wing radical organizations are not banned, asks Owaisi. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై నిషేధానికి తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌లేమ‌ని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2022 2:30 PM GMT
కొంద‌రి వ‌ల్ల‌ సంస్థ మొత్తాన్ని నిషేదించ‌డంలో అర్థం లేదు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై నిషేధానికి తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌లేమ‌ని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నేరానికి పాల్పడిన కొందరి వ‌ల్ల ఆ సంస్థ మొత్తాన్ని నిషేదించ‌డంలో అర్థం లేద‌ని తెలిపారు. పీఎఫ్ఐ నిషేధం సరైనది కాదని ఒవైసీ అన్నారు. ఇది యూఏపీఏ చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని.. ఇది ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి పెద్ద దెబ్బ అని అన్నారు. కొంతమంది సభ్యుల చర్యల ఆధారంగా ఒక సంస్థను నిషేధించరాదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఒవైసీ గుర్తు చేశారు. యూఏపీఏ చట్టం క్రూరమైందని, దీని వల్ల చాలా మంది ముస్లింలు హింసకు గురయ్యారని, జైలుకు వెళ్లారని చెప్పారు. పీఎఫ్ఐపై సభ్యుల రాడికల్, తీవ్రమైన కార్యకలాపాలను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని ఒవైసీ తన వైఖరిని స్పష్టం చేశారు. ఆ సంస్థ సభ్యుల్లో కొందరే చట్టాన్ని ఉల్లంఘించారని, అందుకే తాను మద్దతు ఇవ్వలేనని అన్నారు.

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ), దాని అనుబంధ సంస్థలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలపై ఐదేళ్ల పాటు విధించిన నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు రెహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్ఐఎఫ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో), నేషనల్ విమెన్స్ ఫ్రంట్ (ఎన్‌డబ్ల్యూఎఫ్), జూనియర్ ఫ్రంట్ (జేఎఫ్), ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ (ఈఐఎఫ్), రెహాబ్ ఫౌండేషన్ (కేరళ)పై నిషేధం విధించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలకు చెందిన 247 మంది సభ్యులను అరెస్టు చేసింది.



Next Story