హైదరాబాద్ ఈడీ అడిషనల్ డైరెక్టర్‌గా దినేష్ పరుచూరి
Who is IRS Dinesh Paruchuri, the new ED- Additional Director Hyderabad. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జాయింట్ డైరెక్టర్ గా ఎన్నో హై ప్రొఫైల్ కేసులను
By న్యూస్‌మీటర్ తెలుగు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జాయింట్ డైరెక్టర్ గా ఎన్నో హై ప్రొఫైల్ కేసులను ఇన్వెస్టిగేషన్ చేసిన అభిషేక్ గోయల్ ను ముంబై జోన్-2 కు ట్రాన్స్ఫర్ చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు దగ్గర నుండి ఇటీవలి చీకోటి ప్రవీణ్ కేసినో కేసు దాకా అభిషేక్ గోయల్ విచారణ చేశారు. ఇప్పుడు అభిషేక్ గోయల్ బదిలీతో ఖాళీ అయిన ఆ స్థానంలో ఐఆర్ఎస్ ఆఫీసర్ దినేష్ పరుచూరి నియమితులయ్యారు. హైదరాబాద్ ఈడీ అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరి బాధ్యతలను స్వీకరించారు. ఆగష్టు 10, 2022న అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. . ముంబై జోన్ లో పని చేసే యోగేష్ శర్మని హెడ్ క్వార్టర్(ఇంటెలిజెన్స్) ఢిల్లీకి బదిలీ చేశారు.
ఆగస్ట్ 10, 2022న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో "డైరెక్టరేట్‌లో డిప్యుటేషన్ ప్రాతిపదికన అదనపు డైరెక్టర్‌గా దినేష్ పరుచూరిని నియమించారు. దీని ప్రకారం, అతను చేరిన ఫలితంగా, అదనపు / జాయింట్ డైరెక్టర్ల గ్రేడ్‌లో క్రింది బదిలీ, పోస్టింగ్‌లు తక్షణం అమలులోకి వచ్చేలా.. తదుపరి ఉత్తర్వులు ఆదేశించబడ్డాయి" అని ఉంది.
దినేష్ పరుచూరి ఎవరు..?
గతంలో ఏపీ, తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ రిజనల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు దినేష్ పరుచూరి. ఇప్పుడు ఎన్ ఫోర్స్‌మెంట్ ఆడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. 2009 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ దినేష్ పరుచూరి 31 జూలై 2022న డిప్యూటేషన్ ప్రాతిపదికన అదనపు డైరెక్టర్‌గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోకి వచ్చి చేరారు. ఈ నియామకం నాలుగు సంవత్సరాల కాలానికి ఉంటుంది. అంతకుముందు TRANSCO ట్రాన్స్‌కో జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో దినేష్ పరుచూరి పనిచేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఈఎస్‌ఐ స్కామ్, కార్వీ స్టాక్ మార్కెట్ మోసం, లోన్ యాప్ కేసు, చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం వంటి పలు హై ప్రొఫైల్ కేసులను హైదరాబాద్‌లోని ఈడీ అధికారులు విచారిస్తున్న సమయంలోనే బదిలీలు జరగడం గమనార్హం.