గో హత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలి : భజరంగ్ దళ్
VHP, Bajrang Dal leaders met DGP. గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ డిమాండ్ చేస్తున్నాయి.
By Medi Samrat
గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ డిమాండ్ చేస్తున్నాయి. సోమవారం నాడు డీజీపీని కలిసిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. బక్రీద్ పండుగకు అక్రమంగా గోవులను తరలిస్తున్నారని.. అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకుంటే.. తమ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని.. అరెస్ట్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదులో కోరారు.
అనంతరం తెలంగాణ భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఓ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు జంట నగరాలకు గోవులను తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని.. ప్రభుత్వం, పోలీసుల వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తామని అన్నారు. గోరక్షకులపై అక్రమ కేసులు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని తెలిపారు. మీరు అరెస్టులు చేస్తే మేము ఊరుకోం.. అక్రమ గోవుల తరలింపును ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు.
గో అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: డీజీపీ
— Bajrang Dal Telangana (@ShivaramuluV) June 26, 2023
@ పకడ్బందీగా పోలీసులు తనిఖీ చేయాలి : బజరంగ్ దళ్
@ గోరక్షకు ప్రయత్నం చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయం
@ బజరంగ్ దళ్ కార్యకర్తలను బైండోవర్ పేరుతో భయభ్రాంతులను సృష్టించడ చట్ట విరుదం pic.twitter.com/4CoyRPnotB