హైద‌రాబాద్‌లో ఘ‌నంగా అమెరికా కాన్సులేట్ వార్షికోత్సవం

US Consulate in Hyderabad observe anniversary of American flag at Paigah Palace.హైద‌రాబాద్‌లోని అమెరికా కాన్సులేట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Oct 2022 6:26 AM GMT
హైద‌రాబాద్‌లో ఘ‌నంగా అమెరికా కాన్సులేట్ వార్షికోత్సవం

హైద‌రాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ వార్షికోత్స‌వాన్ని సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. 14 ఏళ్లుగా బేగంపేట‌లోని పైగా ప్యాల‌స్‌లో అమెరికా కాన్సులేట్ కొన‌సాగుతోండ‌గా త్వ‌ర‌లోనే నూత‌న భ‌వ‌నంలోకి మార‌నుంది. ఈ భ‌వ‌నంలో సిబ్బందికి ఇదే చివ‌రి వార్షికోత్స‌వం కావ‌డంతో ఎంతో వేడుక‌గా నిర్వ‌హించారు. 2008 అక్టోబ‌ర్ 24న యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో తొలిసారి అమెరికా జెండా ఎగిరింది.హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో అమెరికా`భారత్‌ సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది.

త్వ‌ర‌లోనే అత్యాధునిక స‌దుపాయాల‌తో 300 మిలియ‌న్ల డాల‌ర్ల వ్య‌యంతో నిర్మించిన నూత‌న భ‌వ‌నంలోకి మార‌నున్నారు. వ‌చ్చే ఏడాది ఈ స‌మ‌యానికి నూత‌న భ‌వ‌నంలో అమెరికా జెండాను ఎగుర‌వేయ‌నున్నారు.

వార్షికోత్స‌వం సందర్భంగా కాన్సులేట్‌ జనరల్‌ జెన్నీఫర్‌ లార్సన్‌ వీడియోను విడుదల చేశారు. అలాగే దీపావళి వేడుకల్ని సైతం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Next Story