స్కాన్ చెయ్.. ఆర్టీసీ లో టికెట్ తీసుకో..

UPI payments on city buses. సిటీ బస్సుల్లో యూపీఐ చెల్లింపులు.. నిజంగా ఎంతో మందికి సహాయకరంగా ఉంటుంది.

By Medi Samrat  Published on  15 Oct 2022 6:00 PM IST
స్కాన్ చెయ్.. ఆర్టీసీ లో టికెట్ తీసుకో..

సిటీ బస్సుల్లో యూపీఐ చెల్లింపులు.. నిజంగా ఎంతో మందికి సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే చిల్లర కండెక్టర్ దగ్గర లేకపోవడమో.. టికెట్ కు సరిపడా చిల్లర మన దగ్గర లేకపోవడమో జరుగుతూ ఉంటుంది. అదే క్యూఆర్ కోడ్ ఉంటే.. ఎంచక్కా ఏదో ఒక యూపీఐ పేమెంట్ యాప్ తో టికెట్ డబ్బులు కట్టేయొచ్చు. ఇకపై యూపీఐ పేమెంట్ ద్వారా టికెట్లను ఇవ్వడానికి టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. వచ్చే నెల నుంచే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌ పే త‌దితర డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఐ-టిమ్స్‌ సహాయంతో డిజిటల్‌ చెల్లింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈనేపథ్యంలో సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌ పెడుతూ క్యాష్‌తో పనిలేకుండా, ఈ మెషిన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రవేశపెడుతున్నామని ఆయన అన్నారు. మియాపూర్‌-1, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, బీహెచ్‌ఈఎల్‌, కుషాయిగూడ డిపోల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా యూపీఐ చెల్లింపులు విజయవంతంగా అమలు చేశామని.. అలాగే ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపుల విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.



Next Story