హైదరాబాద్ కు రానున్న ఆదిత్యనాథ్.. అక్కడ ప్రత్యేక పూజలు

UP chief minister Yogi Adityanath's visit to Hyderabad's Bhagyalakshmi temple. హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రానున్నారు.

By Medi Samrat  Published on  29 Jun 2022 1:04 PM GMT
హైదరాబాద్ కు రానున్న ఆదిత్యనాథ్.. అక్కడ ప్రత్యేక పూజలు

హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. ఇక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమావేశాలకు హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జులై 2వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హాజరుకానున్నారు. "జూలై 2న ఆలయాన్ని సందర్శించాల్సిందిగా బీజేపీ తెలంగాణ యూనిట్ యోగి ఆదిత్యనాథ్ కు అభ్యర్థన పంపింది. మంగళవారం మాకు ఆయన ఆమోదం లభించింది" అని బీజేపీ నేతలు మీడియాకి తెలిపాయి.

హై సెక్యూరిటీ మధ్య ఆయన నేరుగా భాగ్యలక్ష్మి టెంపుల్ కు వస్తారని బీజేపీ వర్గాలు చెప్పాయి. భాగ్యలక్ష్మి ఆలయానికి రావాల్సిందిగా యోగి ఆదిత్యానాథ్ ను బీజేపీ నేతలు కోరడంతో ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 2, 3 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ టి రాజా సింగ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ప్రకారం, ఆయన ప్రార్థనలు చేయడానికి ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు.Next Story