భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
Ujjaini Mahankali Bonalu. లష్కర్ బోనాలు వైభవంగా నిర్వహిస్తూ ఉండగా.. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి
By Medi Samrat
లష్కర్ బోనాలు వైభవంగా నిర్వహిస్తూ ఉండగా.. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. కరోనా పరిస్థితుల వల్ల గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పారు. మహమ్మారి ఇబ్బంది పెట్టినా నన్ను నమ్మి ప్రజలు పూజలు చేశారని అన్నారు. వర్షాల కారణంగా ప్రజలు, రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటారని నేను మీ వెంట ఉండి నడిపిస్తానని చెప్పారు. అమ్మకి ఎంతో చేసినా ఏమీ ఒరగలేదని అనొద్దని, ప్రతి ఒక్కరినీ తాను కాపాడుకుంటానని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్పారు.
ఈ మహమ్మారి వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎటు సంకోచించకుండా ఇంత పెద్దగా ఉత్సవాలు జరిపేందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వానలతో వరదలు వచ్చి కష్టాలు ఉన్నప్పటికీ తాను కాపాడుకుంటానన్నారు. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని, ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు.