సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్ నిలయం పక్కన వాషింగ్ లైన్‌లో నిలిపి ఉంచిన రైల్లో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 20 Jun 2024 1:05 PM ISTసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్ నిలయం పక్కన వాషింగ్ లైన్‌లో నిలిపి ఉంచిన రైల్లో మంటలు చెలరేగాయి. స్పేర్ కోచ్‌ల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. రెండు బోగీల నుండి భారీ ఎత్తున పొగలు ఎగిసిపడుతూ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కోచ్ క్లీనింగ్ కి వెళ్లి ఫ్లాట్ ఫామ్ మీదకు వస్తున్న అదనపు ఏసీ బోగీలో షాట్ సర్క్యూట్ కారణం గా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాద సమయంలో రైల్ కోచ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే సిబ్బందికి స్పష్టత లేకపోగా, అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలను సవివరంగా పరిశీలించిన తర్వాతే తెలుస్తుందని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. అలుగడ్డ బావి వద్ద ఉన్న స్పేర్ కోచ్‌ల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.కాగా ప్రమాద సమయంలో రైల్… pic.twitter.com/dhklTK2wxi
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 20, 2024
సంబంధిత గమ్యస్థానం నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న చాలా రైళ్లు మెట్టుగూడలోని ఎస్‌సీఆర్ ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్-అండర్-బ్రిడ్జి వద్ద వాషింగ్ లైన్ వద్ద ఆపివేయబడతాయి. కోచ్‌లను క్లీన్ చేసిన తర్వాత, కోచ్‌లను షెడ్యూల్ చేసిన ప్రయాణానికి సికింద్రాబాద్ స్టేషన్‌కు తీసుకువెళతారు.