నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి
Two Children died in Niloufer Hospital.హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి కలకలం
By తోట వంశీ కుమార్ Published on
2 March 2022 5:09 AM GMT

హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి కలకలం రేపుతోంది. చిన్నారుల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రికి తీసుకురాగా.. ఉదయం నర్సు ఇంజక్షన్ ఇచ్చినట్లు తెలిపారు. ఇంజక్షన్ చేసిన కాసేపటికే చిన్నారులు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై నిలోఫర్ వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే చిన్నారుల ఆరోగ్యం విషమించిందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం నిలోఫర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story