ముచ్చింతల్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్న టీఎస్ఆర్టీసీ
TSRTC to ply special buses to Statue of Equality for 10 days. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నగరంలోని వివిధ ప్రాంతాల
By Medi Samrat Published on 1 Feb 2022 7:23 PM ISTతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ముచ్చింతల్‌లోని త్రిదండి చిన జీయర్ స్వామి ఆశ్రమానికి ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ(రామానుజాచార్యులు) విగ్రహాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి తరలివస్తారని అంచనా వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 13 వరకు జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, హయత్‌నగర్ బస్ స్టేషన్, పటాన్‌చెరు బస్ స్టేషన్ నుంచి బస్సులు నడపనున్నారు.
#TSRTC has arranged special buses to #muchinthal Statue of Equality from the important locations, Timings also furnished. Buses will be scaled up as per traffic demand. Choose #TSRTCBuses for your journeys pic.twitter.com/CEq36k0wzJ
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 31, 2022
ముంచింతల్‌లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజాచార్యులు 1,000వ జన్మదినోత్సవం సందర్భంగా 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. రామానుజాచార్యులు విగ్రహాన్ని 2017లో ప్రతిష్టించినప్పటికీ మిగిలిన నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టిందనేది ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం.