పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు

నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు

By Medi Samrat  Published on  31 Aug 2024 8:30 PM IST
పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు

నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్‌లు వాడుతూ 107 మందిని అధికారులు పరీక్షించగా, ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. శనివారం మధ్యాహ్నం 1 గంటల వరకూ ఈ సోదాలు జరిగాయి. నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు తనిఖీల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున వరకు తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో పలువురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టింగ్‌ లో బయటపడింది. ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ కమలహాసన్‌ రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ రెడ్డి ఆర్‌ కిషన్‌ పాల్గొన్నారు.

Next Story