తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
TRS MLA Prakash Goud Tests Corona Positive. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంత కాలంగా
By Medi Samrat Published on 23 Dec 2020 6:31 AMతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంత కాలంగా తగ్గిన కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఈ మహమ్మారి ఎవ్వరిని విడిచిపెట్టడం లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడాలేకుండా అందరికీ ఈ మహమ్మారి సోకుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.
రెండు రోజులుగా ఆయనకు నీరసంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక తనను కలిసిన వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయొద్దని.. తనను కలవటానికి కూడా ప్రయత్నాలు చేయకూడదని ఆయన చెప్పారు. దేవుడి ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని, మళ్లీ ప్రజల ముందుకు వస్తానన్నారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 2,74,833 మంది కోలుకుగా.. 6,627 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1522 మంది ప్రాణాలు కోల్పోయిరు.