అందుకే మైక్ లాక్కొని అడ్డుకున్నాం
TRS leader Nandu Bilal is in Abids police custody. గోషామహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అబిడ్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.
By Medi Samrat Published on 9 Sep 2022 1:08 PM GMTగోషామహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అబిడ్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైద్రాబాద్ నగరానికి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని విమర్శించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే గోషామహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమం జరుగుతుండగా మైక్ ను లాక్కున్నాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. అప్రమతమైన పోలీసులు నందు బిలాల్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్ వద్ద నందు బిలాల్ మాట్లాడుతూ.. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ గణేష్ ఉత్సవాలకు వచ్చారు. ధర్మ కార్యక్రమానికి వచ్చిన అస్సాం సీఎం.. రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ ని దూషించారు.. దీంతో మేం సహనం కోల్పోయి మైక్ లాక్కొని అడ్డుకున్నాం. మా నిరసన వ్యక్తం చేసాం. గణేష్ శోభయాత్ర కు వచ్చిన సీఎం.. శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు. రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే.. మేం ఊరుకోమ్.. ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరగనివ్వండి.. మరోసారి బిజెపి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై అనుచిత వాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.