హైదరాబాద్‌లో విషాదం.. నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌ నగరంలోని రాయదుర్గం పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నీటి సంపులో పడి 24 ఏళ్ల సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు.

By అంజి
Published on : 22 April 2024 4:28 PM IST

Hyderabad, Software employee, Crime

హైదరాబాద్‌లో విషాదం.. నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి 

హైదరాబాద్‌ నగరంలోని రాయదుర్గం పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నీటి సంపులో పడి 24 ఏళ్ల సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్ లోని ఓ హాస్టల్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న సంపు పై కప్పు తెరిచి ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు సాఫ్ట్‌వేర్‌ ఉద్యొగి అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంపులో పడిన వెంటనే తలకు బలమైన గాయం అవ్వడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. సంపు పైకప్పు పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన హాస్టల్ యజమాని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story