జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ‌.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం

Tragedy At Raja Singh House. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం

By Medi Samrat  Published on  23 Nov 2020 4:00 AM GMT
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ‌.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆయ‌న వ‌య‌సు 19 సంవ‌త్స‌రాలు. రాజాసింగ్ బావమరిది మనీష్ సింగ్ కుమారుడు అయిన రోహిత్ సింగ్ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు. రోహిత్ అంత్యక్రియలు నిన్నరాత్రి నిర్వహించారు. మంగల్హాట్ నివాసం నుండి శ్మశానం వరకు అంతిమయాత్ర సాగింది.

ఈ కారణం వల్లనే.. బండి సంజయ్ ని తొలగించమని ఆయన ట్వీట్ చేసినట్లు వైరల్ అయిన ప్రచారంపై బయటికి వచ్చి మాట్లాడలేదు. కానీ మీడియాకు పంపిన నోట్ లో బండి సంజయ్ తనను మోసం చేసిన మాట వాస్తవమేనని సంచలన కామెంట్స్ చేసారు రాజా సింగ్. తన వర్గానికి చెందిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వమని అడిగినా బండి సంజయ్ పట్టించుకోలేదని తెలిపారు. ఇక్కడ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తనను గెలిపించిన కార్యకర్తలకు కూడా టికెట్ ఇప్పించుకోలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్‌.


Next Story