హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions will be in force in hyderabad on monday. హైదరాబాద్ నగరంలో సోమవారం నాడు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు
By M.S.R Published on 5 March 2023 11:47 AM GMTTraffic Restrictions in hyderabad
హైదరాబాద్ నగరంలో సోమవారం నాడు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు. హైదరాబాద్ పోలీసులు నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ దగ్గర షీ టీమ్స్ 5కే, 2.5కే రన్ నిర్వహిస్తూ ఉండడంతో.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
వీవీ విగ్రహం నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వీవీ విగ్రహం వద్ద షాదన్, నిరంకారి భవన్ వైపు మళ్లించనున్నట్లు తెలిపారు. తెలుగు తల్లి నుండి వచ్చే ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించమని, ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఇక ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఓల్డ్ గేట్ సెక్రటేరియట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై మళ్లించనున్నామని.. లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగు తల్లి, ఇక్బాల్ మినార్ మలుపు వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్బలా మైదాన్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వద్ద DBR మిల్స్ వైపు మళ్లిస్తారు. ఇక కవాడిగూడ ఎక్స్ రోడ్ నుండి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వైపు అనుమతించరు. DBR మిల్స్ నుండి వచ్చే వాహనాలను చిల్డ్రన్ పార్క్ వైపు వెళ్లేందుకు అనుమతి ఉండదు. అలాగే మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను నల్లగుట్ట జంక్షన్ వద్ద వద్ద రాణిగంజ్, మినిస్టర్ రోడ్ వైపు మళ్లించనున్నారు.