హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions in Hyderabad in view of TS Assembly Budget sessions.హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్.
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2023 12:18 PM ISTహైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఆదివారాలు మినహా..శుక్రవారం నుంచి సమావేశాలు ముగిసేంత వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. తెలుగు తల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ఖైరతాబాద్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.
తెలుగుత్లి- ఇక్బాల్ మినార్- వివి విగ్రహం - షాదన్ - నిరంకారి - పాత పిఎస్ సైఫాబాద్ - రవీంద్ర భారతి-పాతపోలీస్ స్టేష్- మాసబ్ ట్యాంక్ - PTI భవనం - అయోధ్య - నిరంకారి- కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ - బషీర్‌బాగ్ జంక్షన్ నుండి పాత పిసిఆర్ జంక్షన్ వరకు; BJR విగ్రహం - AR పెట్రోల్ పంప్ - పాత PCR జంక్షన్; M J మార్కెట్ - తాజ్ ఐలాండ్ - నాంపల్లి రైల్వే స్టేషన్ - AR పెట్రోల్ పంప్ - పాత PCR జంక్షన్; BRK భవన్ - ఆదర్శ్ నగర్ - పాత PCR జంక్షన్; మంత్రుల నివాస సముదాయం, రోడ్ నెం. 12, బంజారాహిల్స్ - విరించి హాస్పిటల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన సభ, శాసన మండలి ఉభయ సభల సంయుక్త సమావేశంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్యాహ్నాం 12.10 గంటల సమయంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.