వాహనదారులకు గమనిక.. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad Tomorrow.హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు గ‌మ‌నిక‌. రేపు(ఆదివారం) న‌గ‌రంలోని ప‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2022 11:03 AM GMT
వాహనదారులకు గమనిక.. నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు గ‌మ‌నిక‌. రేపు(ఆదివారం) న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. షీ టీమ్స్ ఆధ్వ‌ర్యంలో 5కే, 2కే ర‌న్‌ల‌ను నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి లేపాక్షి ట్యాంక్ బండ్‌, పీవీఎన్ఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఉద‌యం 5 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

- నెక్లెస్‌ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా వెళ్లే వాహ‌నాల‌ను షాదాన్‌ కాలేజ్‌, నిరంకారీ భవన్‌ మీదుగా మళ్లిస్తారు.

- ఇక్బార్‌ మినార్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా

- లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లించి తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ మీదుగా

- సంజీవయ్య పార్కుకు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌ ఎక్స్‌రోడ్డు మీదుగా అనుమతిస్తారు.

5కె, 2కె రన్ కు వ‌చ్చే వారి కోసం ఎంఎస్‌మక్తా, ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ ఎదురుగా, డాక్టర్స్‌ కార్‌ పార్కింగ్‌, ఎంఎంటీఎస్‌ నెక్లెస్‌ రోడ్డు, లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు.

Next Story
Share it