హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్డేడియంలో

By Medi Samrat  Published on  7 Nov 2023 5:00 AM GMT
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ స్డేడియంలో బీజేపీ తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ సభకు ఆయన హాజరు కానున్నారు. మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సభ జరగనున్న ఎల్బీ స్టేడియానికి 5.25 గంటలకు చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బీజేపీ బీసీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ పయనమవుతారని పార్టీ వర్గాలు అధికారిక షెడ్యూల్ విడుదల చేశాయి. ప్రధాని పర్యటన మెుత్తం గంటన్నరలో ముగుస్తుంది.

ప్రధాని పర్యటన నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటను దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారుల మూసివేత, దారిమళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌కు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. అటు వైపు నుంచే వచ్చే వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు డైవర్ట్ చేస్తారు.

ట్యాంక్‌బండ్‌ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ వద్ద హిమాయత్‌నగర్‌ వైపు డైవర్ట్ చేస్తారు. అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి నుంచి చాపల్‌ రోడ్డులోకి మళ్లిస్తారు.

Next Story