టీఆర్‌ఎస్‌ ప్లీనరీ మీటింగ్‌.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions in hyderabad due to trs plenary meeting. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక నుండి పార్కింగ్‌ వరకు అన్ని

By అంజి  Published on  24 Oct 2021 10:23 AM IST
టీఆర్‌ఎస్‌ ప్లీనరీ మీటింగ్‌..  రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ కోసం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక నుండి పార్కింగ్‌ వరకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. రేపటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు, పార్టీ ప్రతినిధులు మొత్తంగా 6 వేల మంది ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రానున్నారు.

రేపటి సమావేశం నేపథ్యంలో హైటెక్స్‌ ఏరియాలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. నీరూస్‌ నుండి గచ్చిబౌలి వెళ్లే వాహనాలు.. అయ్యప్ప సొసైటీ, మదాపూర్‌, దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్, ఐటీసీ కొహినూర్‌, ఐకియా, బయో డైవర్సిటీ నుండి గచ్చిబౌలి వెళ్లాలి. అలాగే మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ నుంచి హైటెక్‌సిటీ, సైబర్‌టవర్స్‌, జుహ్లీహిల్స్‌కు వెళ్లే వాహనదారులు.. రోలింగ్‌హిల్స్‌ ఏఐజీ ఆస్పత్రి, ఐకియా, ఇనార్బిట్‌మాల్‌, దుర్గం చెరువు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్సీ పురం, చందానగర్‌, లింగంపల్లి నుండి మాదాపూర్‌, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులు.. బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ఐఐఐటీ గచ్చిబౌలి రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది.

Next Story