వాహనదారులకు అలర్ట్‌.. న‌గ‌రంలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions In Amberpet Area Due To Mahankali Bonalu. హైద్రాబాద్‌ అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ వరకు జరిగే బోనాల ఉత్సవాల

By Medi Samrat  Published on  14 July 2023 8:00 PM IST
వాహనదారులకు అలర్ట్‌.. న‌గ‌రంలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

హైద్రాబాద్‌ అంబర్‌పేట్‌లోని మహంకాళి ఆలయంలో జులై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ వరకు జరిగే బోనాల ఉత్సవాల సందర్భంగా నగర పోలీసులు ట్రాఫిక్‌ మళ్లింపులు జారీ చేశారు. ఈ ఆంక్ష‌లు జూలై 16వ తేదీ ఉదయం 6 గంటల నుండి జూలై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.

ఉప్పల్ నుంచి అంబర్‌పేట వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వాహనాలు ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్డులో హబ్సిగూడ-తార్నాక-అడిక్‌మెట్‌-విద్యానగర్‌-ఫీవర్‌ హాస్పిటల్‌-టీవై మండలి, టూరిస్ట్ హోటల్ జంక్ష‌న్‌ – నింబోలిఅడ్డ – చాదర్‌ఘాట్, సీబీఎస్‌ మీదుగా మళ్లిస్తారు. తిరుగు ప్ర‌యాణం వ్య‌తిరేక‌ మార్గంలో ఉంటుంది.

కోటి నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు, సిటీ బస్సులను నింబోలిఅడ్డ-టూరిస్ట్ హోటల్-టీవై మండలి-ఫీవర్ హాస్పిటల్-అడిక్‌మెట్-తార్నాక-హబ్సిగూడ-ఉప్పల్ ఎక్స్ రోడ్ల మీదుగా మళ్లిస్తారు.

ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ - మల్లికార్జున నగర్ - డిడి కాలనీ - సిండికేట్ బ్యాంక్ - శివం రోడ్డు వద్ద మళ్లిస్తారు. గోల్నాక, మూసారాంబాగ్, అంబర్‌పేట్ - సల్దానా గేట్ - అలీ కేఫ్ X రోడ్లు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్‌ వైపు మళ్లిస్తారు. తిరిగి వచ్చే మార్గం దీనికి విరుద్ధంగా ఉంటుంది.

ఈ రూట్లలో ట్రాఫిక్​ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సిటీ పోలీసులు కోరారు.


Next Story